LOADING...
Zuckerberg: ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్యాన్‌పై కోర్టులో కేసు వేసిన జుకర్‌ బర్గ్‌
ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్యాన్‌పై కోర్టులో కేసు వేసిన జుకర్‌ బర్గ్‌

Zuckerberg: ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్యాన్‌పై కోర్టులో కేసు వేసిన జుకర్‌ బర్గ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్‌ తన అకౌంట్‌ను బ్యాన్‌ చేయడంపై ఇండియానాకు చెందిన న్యాయవాది మార్క్‌ స్టీవెన్‌ జుకర్‌బర్గ్ గత ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన పేరు కూడా మెటా అధినేత మార్క్‌ ఎలియట్‌ జుకర్‌బర్గ్‌తో సమానం. 2017లో తన న్యాయసేవలను ప్రచారం చేసుకోవడానికి ఫేస్‌బుక్‌లో పేజీని ప్రారంభించిన మార్క్‌ స్టీవెన్, దాని కోసం 11 వేల డాలర్లకుపైగా ఖర్చు చేశారు. అయితే ఆ పేజీని ఫేస్‌బుక్‌ తరచూ బ్లాక్‌ చేస్తూనే వచ్చింది. కారణం అడిగితే మీరు ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ను అనుకరిస్తున్నారనే సమాధానం ఇచ్చింది. దీంతో తన అసలు వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం ప్రతిరోజూ ఒక పెద్ద తలనొప్పిగా మారింది.

Details

ప్రాంక్ కాల్స్ అనుకుని కట్‌ చేస్తున్నారు

ఈ బ్యాన్‌ కారణంగా తనకు వ్యాపార నష్టం వాటిల్లిందని, క్లయింట్లను కోల్పోయినట్లు ఆయన కోర్టులో వాపోయారు. ఫేస్‌బుక్‌లో సమస్యలు రాగానే iammarkzuckerberg.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించినా, ఫోన్‌ ద్వారా కస్టమర్లను సంప్రదిస్తే ప్రాంక్ కాల్స్ అనుకుని కట్‌ చేస్తున్నారని తెలిపారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు: బిలియనీర్ జుకర్‌బర్గ్ స్కూల్‌ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను. ఇది వ్యంగ్యం కాదు. కానీ ఆర్థికంగా నష్టపోయేది నేనే కదా. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నానని, ఫేస్‌బుక్‌ తనను బ్యాన్‌ చేయడం అన్యాయం అని స్పష్టం చేశారు.

Details

ఈ సమస్యను మళ్లీ జరగదు

అంతేకాక, ఆయన బిలియనీర్ జుకర్‌బర్గ్‌కి ఓ ఆఫర్‌ కూడా ఇచ్చారు. అతను నన్ను క్షమించమని అడిగితే లేదా తన పడవలో వారం రోజులు గడిపేందుకు అనుమతిస్తే, కోర్టులు, కేసులు అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. ఈ దావా విషయంపై మెటా స్పందిస్తూ జుకర్‌బర్గ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.