Nikhil: 20 రోజుల్లోకి ఓటిటిలోకి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో ఓటిటిలో సినిమాల విడుదల పద్ధతి రోజు రోజుకు మారిపోతోంది. పలు చిత్రాలు ప్రమోషన్ లేకుండా, విడుదల తేదీ ప్రకటించకుండా నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి.
తాజాగా నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం కూడా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 'రిషి, తారల ప్రేమకథను చూడండి' అంటూ అమెజాన్ ఓ పోస్టర్ ద్వారా పేర్కొంది.
స్వామిరారా, కేశవ చిత్రాల తర్వాత నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఈ మూవీ వచ్చింది. ఇందులో రుక్మిణీ వసంత్, దిశ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు
నిఖిల్ ఈసారి రేసర్ పాత్రలో కనిపించాడు.
Details
నెగిటివ్ టాక్ తో రెండు రోజుల్లోనే థియోటర్ నుంచి తప్పుకున్న నిఖిల్ మూవీ
నవంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి షోకే నెగటివ్ టాక్‌తో రెండు రోజుల్లోనే థియేటర్ల నుంచి తప్పుకుంది.
కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించిన నిఖిల్ తర్వాత పెద్దగా హిట్ ఇవ్వలేకపోతున్నాడు.
స్పై చిత్రం ఫ్లాప్ కావడం, ఇప్పుడు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి.
అయితే థియేటర్లలో చూడలేని వారు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.