
2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మళయాలంలో రిలీజై వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన 2018, ఇప్పుడు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ లో కనిపించిన దాని ప్రకారం, ఈ సినిమాలో తుఫాను వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తమ జీవితాలను బ్రతికించుకోవడం కోసం ఎన్ని అవస్థలు పడ్డారో చూపెట్టబోతున్నారు.
అప్పటివరకూ సాధారణంగా గడిచిన జీవితాలు తుఫాను వల్ల రాత్రికి రాత్రే జీవన్మరణ సమస్యగా ఎలా మారిందో చూపెట్టబోతున్నారని అర్థమవుతోంది.
ఎవ్రీ వన్ ఈజ్ హీరో అనే క్యాప్షన్ కు తగినట్లుగా ఈ ట్రైలర్ లో ఎవ్వరినీ ప్రముఖంగా చూపించలేదు. జీవితాలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ హీరోలే అన్నట్టుగా చూపించినట్టు తెలుస్తోంది.
Details
మళయాలంలో వందకోట్లు సాధించిన చిత్రం
మే 5వ తేదీన మళయాలంలో రిలీజైన ఈ చిత్రం, కేవలం 13రోజుల్లోనే వందకోట్ల కలెక్షన్లను సాధించినట్టుగా సమాచారం. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ వసూళ్ళు వస్తున్నాయి.
టోవినో థామస్, కుచకోబోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
కావ్యా ఫిలిమ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, జూన్ ఆంథనీ జోసెఫ్ డైరెక్ట్ చేసారు.
ప్రస్తుతం ఈ చిత్ర తెలుగు అనువాదాన్ని నిర్మాత బన్నీ వాసు, మే 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో తెలుగు ట్రైలర్
#2018Movie Telugu Trailer out now. The film releasing in theatres on 26th May.
— Aakashavaani (@TheAakashavaani) May 22, 2023
Link: https://t.co/vn7XjVnUEF pic.twitter.com/GgtAjcWiTE