Page Loader
తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మళయాలం చిత్రం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 
సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనున్న 2018 మూవీ

తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మళయాలం చిత్రం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 

వ్రాసిన వారు Sriram Pranateja
May 29, 2023
08:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

2018లో కేరళలో వచ్చిన వరద భీభత్సాన్ని కథగా మలుచుకుని 2018అనే టైటిల్ తో వెండితెర మీదకు తీసుకొచ్చాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. మళయాలంలో వందకోట్ల వసూళ్ళను సాధించిన ఈ చిత్రం ఈ మధ్య తెలుగులో రిలీజైంది. తెలుగులో ఈ సినిమాకు మంచి వసూళ్ళు వస్తున్నాయి. ఈ సినిమాలో టోవినో థామస్, అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. సోనీ లివ్ లో 2018 చిత్ర మళయాలం వెర్షన్, జూన్ 7వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు సోనీ లివ్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓటీటీలో రిలీజ్ అవుతున్న 2018 సినిమా