28°C : '28°C' థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నవిన్ చంద్ర
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.'అందాల రాక్షసి'చిత్రంతో మంచి గుర్తింపు పొందిన ఆయన,ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
హీరోగా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ,విలన్‌గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
మూవీలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్ననవీన్ చంద్ర,తాజాగా '28°C' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా,'పొలిమేర'చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సాయి అభిషేక్ నిర్మిస్తున్నఈ చిత్రంలో ప్రియదర్శి,వైవా హర్ష, జయప్రకాశ్, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఏప్రిల్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
వివరాలు
'చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా?'
ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే 'చెలియా చెలియా..'అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ ఈ పాటను అందంగా కంపోజ్ చేయగా,కిట్టు విస్సాప్రగడ హృద్యమైన లిరిక్స్ అందించారు.
సింగర్ రేవంత్ తన గాత్రంతో ఈ పాటను మరింత ఆకర్షణీయంగా ఆలపించారు.
తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి, చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
హారర్ థ్రిల్లర్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే అనిల్ విశ్వనాథ్, '28°C' సినిమాను కూడా కొత్త జానర్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది.
కథపై ఎలాంటి క్లూస్ రానీయకుండా కట్ చేసిన ట్రైలర్ చివర్లో 'చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా?' అనే డైలాగ్‌తో ముగిసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.