
War 2 Movie: వార్ 2 విడుదలకు 30 రోజులు.. ఎన్టీఆర్ షేర్ చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన 'వార్' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మళ్లీ 'రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్' పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ప్రతినాయక పాత్రలో సందడి చేయనున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Details
హీరోయిన్‌గా కియారా అద్వానీ
ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా 'కౌంట్‌డౌన్ పోస్టర్'ను విడుదల చేసింది. 'ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలాయి' అంటూ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఈ పోస్టర్‌ను తన ఎక్స్ అకౌంట్ (Twitter) ద్వారా పంచుకున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. యష్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్ పెంచుతోంది టీమ్. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మల్టీస్టారర్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల అంచనాలను ఎలా అందుకుంటుందో చూడాలి.