LOADING...
Sandeep Reddy Vanga: 70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!
70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!

Sandeep Reddy Vanga: 70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న 'స్పిరిట్‌' సినిమా గురించి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొని ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్‌ తర్వాత వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. సందీప్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 70 శాతం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పూర్తి చేశాం. యానిమల్‌ సినిమా సమయంలో కూడా షూటింగ్‌ మొదలు కాకముందే 80 శాతం బీజీఎమ్‌ వర్క్‌ పూర్తి చేశాం. ఇలా ముందుగానే మ్యూజిక్‌ సిద్ధం చేస్తే సీన్‌ ఔట్‌పుట్‌ స్పష్టంగా తెలుస్తుంది.

Details

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్ 

అలాగే సమయం, ప్రొడక్షన్‌ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రభాస్‌తో నాకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.ఆయన పాన్‌ ఇండియా రేంజ్‌ హీరో అయినప్పటికీ ఆ హంగు ఆయనలో కనిపించదు. ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సపోర్ట్‌ చేశారు. త్వరలో ప్రభాస్‌తో కలిసి వస్తామని అన్నారు.ఈసినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కథలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉండబోతోందని,అది మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఆ సన్నివేశాల్లో ప్రభాస్‌ మాఫియా డాన్‌గా కూడా కనిపించనున్నారని టాక్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ 'స్పిరిట్‌'కి బీజీఎమ్‌ అందిస్తున్నారు. ఆయన యానిమల్‌లో పాటలతో పాటు రావణాసుర, డెవిల్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించి మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు.