'800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో ఈయనొక దిగ్గజం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్.
మురళీధరన్ జీవితం ఆధారం తెరకెక్కిన సినిమా '800'. అక్టోబర్ 6న '800' మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
'800' మూవీ డిజిటల్ హక్కులను 'జియో సినిమా' ఓటీటీ దక్కించుకుంది. ఈ మూవీ డిసెంబర్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా ట్వీట్ చేసింది.
ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దీన్ని విడుదల చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జియో సినిమా ట్వీట్
கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை.
— JioCinema (@JioCinema) November 14, 2023
டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn