Page Loader
Kiara Advani: కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్.. 'గేమ్ ఛేంజర్' నుంచి పోస్టర్ రిలీజ్ 
కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్.. 'గేమ్ ఛేంజర్' నుంచి పోస్టర్ రిలీజ్

Kiara Advani: కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్.. 'గేమ్ ఛేంజర్' నుంచి పోస్టర్ రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2024
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం రామ చరణ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్20న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇవాళ కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా 'గేమ్ ఛేంజర్' మూవీ టీం ఆమెకి విషెస్ తెలిపింది.

Details

స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

ఈ సందర్భంగా ఆ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ మూవీలో కియారా 'జాబిలమ్మ' రోల్‌లో నటిస్తోంది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖనీ వంటి నటినటీలు కీలక పాత్రలో కనిపించనున్నారు.