తదుపరి వార్తా కథనం
Gopichand: గోపిచంద్ 'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్.. యాక్షన్ డ్రామాతో సూపర్బ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 31, 2024
11:59 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీనువైట్ల, గోపిచంద్ కాంబోలో 'విశ్వం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తీస్తున్నారు.
గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే విశ్వం సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా చాలా భాగం ఇటలీలోనే షూట్ చేసినట్లు సమాచారం.
Details
త్వరలోనే మూవీ రిలీజ్
ఈ వీడియోలో శ్రీను వైట్లకి కలిసొచ్చిన ట్రైనీ కామెడీని పెట్టారు. వెంకీ సినిమాలో రవితేజ- బ్రహ్మనందం కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది.
ఇప్పుడు అదే రేంజ్ లో విశ్వంలో సినిమాలో చూసే అవకాశం ఉంది.
త్వరలోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.