Rajamouli: ప్రేక్షకుల ఊహలకు తెర.. 'వారణాసి' గురించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'వారణాసి' సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందన్నది ప్రేక్షకుల ఊహలకు వదిలేశారని దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి స్పష్టం చేశారు. సాధారణంగా తన సినిమాల కథాంశాన్ని ముందుగానే సంకేతాల రూపంలో తెలియజేసే ఆయన.. ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించారు. టైటిల్ గ్లింప్స్‌తోనే ఆసక్తి రేకెత్తించి, కథపై సస్పెన్స్‌ను కొనసాగించారు. ఆ గ్లింప్స్ వీడియో ఆధారంగా సినిమా జానర్‌పై అభిమానుల్లో విభిన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆటోమేటిక్ వీల్‌ఛైర్‌లో కనిపించిన విలన్ పాత్రధారి ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్ చూసి, ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రమనే ప్రచారం జోరందుకుంది.
Details
సై-ఫై మూవీ కాదు
సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ ప్రధానంగా సాగింది. అయితే ఈ అనుమానాలకు తాజాగా స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, 'వారణాసి' చిత్రంలో సైన్స్ ఫిక్షన్ తరహా ఫీల్ ఉండొచ్చుగానీ, ఇది పూర్తి స్థాయి సై-ఫై మూవీ కాదని స్పష్టం చేశారు. అసలు ఈ చిత్రం ఫాంటసీ-మైథలాజికల్ జానర్‌లో రూపొందుతోందని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది.