Ra Raja: ఆర్టిస్టులు కనిపించకుండా విభన్న ప్రయోగం.. 'రా రాజా' మార్చి 7న రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాలో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా, కథ, కథనాల మీదే నడిపించడం మామూలు సాహసం కాదు.
కానీ ఆ విభిన్న ప్రయోగానికి శ్రీమతి పద్మ సమర్పణలో, శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై దర్శకుడు బి. శివ ప్రసాద్ సిద్ధమయ్యారు.
'రా రాజా' పేరుతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాను మార్చి 7న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
Details
ప్రేక్షకులు ఆదరించాలి
చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా, దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ 'నిర్మాతగా సినిమాలు చేస్తున్న సమయంలో నా మైండ్‌లోకి వచ్చిన ఓ పాయింట్‌ను కథగా మలిచానని చెప్పారు.
అలా అనుకోకుండానే తాను దర్శకుడిగా మారిపోయాయని చెప్పారు.
ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, ఇప్పటి వరకు చూసిన వారంతా ప్రశంసించారన్నారు.
మార్చి 7న 'రా రాజా' ప్రేక్షకుల ముందుకు వస్తోందని, అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని ఆయన కోరారు.