ప్రభాస్- మారుతి సినిమాపై కీలక అప్డేడ్.. ఇక ఫ్యాన్స్ కు పండుగే
ప్రభాస్-మారుతి దర్శకత్వంలో ఒక హారర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ మాళవికా మోహనన్ నటిస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాను మాత్రం చాలా సైలెంట్ గా ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ గానే, ఇతర క్యాస్ట్ డీటెయిల్స్ కానీ ఇంతవరకు విడుదల చేయలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. థమన్ ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
పరిశీలనలో రాజా డీలక్స్ టైటిల్!
తాజా సమాచారం మేరకు జూన్ మొదటి వారం నుంచి థమన్ ఈ సినిమాను కంపోజింగ్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే వాస్తవమైతే సిల్వర్ స్క్రీన్ పై థమన్-ప్రభాస్ కాంబో మ్యూజిక్ విజువల్ ట్రీట్ లా ఉండడం ఖాయమైనట్టేనని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాలో మరో భామ రిద్దికుమార్ కూడా నటిస్తున్నట్లు మరో అప్డేట్ బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలన లో ఉంది.