LOADING...
Chiranjeevi: బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. ఓదెలకు రెడ్ సిగ్నల్?
బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. ఓదెలకు రెడ్ సిగ్నల్?

Chiranjeevi: బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. ఓదెలకు రెడ్ సిగ్నల్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, యువ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేర్ వీరయ్య' సినిమా2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సినిమా చిరంజీవికి బ్రేక్ ఇవ్వడమే కాక, మళ్లీ మాస్ మార్కెట్‌లో పట్టు సంపాదించేందుకు దోహదపడింది. చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో మెరిశాడు. బాబీ, ఈ ఇద్దరు స్టార్ హీరోలను సమతుల్యంగా ప్రెజెంట్ చేస్తూ, చిరంజీవి కామెడీ తరహాలో మళ్లీ వింటేజ్ ఫన్ టచ్‌ను తెరపై చూపించగలిగాడు. ఇప్పుడు ఈ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి తెరపైకి రానుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'విశ్వంభర' షూటింగ్ పూర్తయింది.

Details

వరుస సినిమాలతో చిరు ఫుల్ బీజీ 

అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్‌బస్టర్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో జరుగుతున్న మరో సినిమా కూడా ఫినిషింగ్ స్టేజ్‌కు చేరుకుంది. 'వాల్తేర్ వీరయ్య' విజయాన్ని చొప్పించి, మరోసారి బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'డాకు మహారాజ్' కూడా మంచి విజయం సాధించడంతో, అదే ఊపులో మెగాస్టార్ కోసం ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశాడట. ఈప్రాజెక్ట్‌ను సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక బాబీ సినిమా తర్వాత మెగాస్టార్, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను మొదలుపెట్టనున్నారు.అంటే చిరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.