Loading...
Amala Akkineni: అక్కినేని ఇంట్లో కోడళ్ల సందడి.. అత్తగా ఉండటం ఆనందంగా ఉంది: అమల
అక్కినేని ఇంట్లో కోడళ్ల సందడి.. అత్తగా ఉండటం ఆనందంగా ఉంది: అమల

Amala Akkineni: అక్కినేని ఇంట్లో కోడళ్ల సందడి.. అత్తగా ఉండటం ఆనందంగా ఉంది: అమల

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబంలోకి కోడళ్లు రావడంతో తమ ఇంటి వాతావరణమే పూర్తిగా మారిపోయిందని నటి అమల అక్కినేని (Amala Akkineni) అన్నారు. గతంలో ఇంట్లో ఎక్కువగా పురుషులే ఉండేవారని.. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల రాకతో మహిళల సందడి మొదలైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala), అఖిల్ భార్య జైనబ్ రవ్ద్జీ (Zainab Ravdjee)తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

వివరాలు

అత్తగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది

అత్తగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మా ఇంట్లో అందరూ మగవాళ్లే ఉండేవారు. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇంట్లో మహిళల సందడి ఉండటం చాలా బాగుందని అమల తెలిపారు.

ఈ సందర్భంగా శోభిత గురించి మాట్లాడుతూ.. ఆమె వృత్తిపరంగా సాధించిన విజయాలను ప్రశంసించారు.

వివరాలు

జైనబ్‌తో మరింత దగ్గరి అనుబంధం

శోభిత ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. అందరితోనూ సులువుగా కలిసిపోతుంది. జైనబ్‌తో నాకు మరింత దగ్గరి అనుబంధం ఉంది.

అఖిల్ ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడే నేను కలిశాను. అప్పటి నుంచే తను నాకు ఎంతో నచ్చింది. చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటుంది.

సొంత కూతురిలా అనిపిస్తుంది. తనకంటే ఎక్కువగా నా గురించి శ్రద్ధ తీసుకుంటుంది. నాగార్జునను కూడా ఎంతో బాగా చూసుకుంటుంది'' అని అమల వెల్లడించారు.

ADVERTISEMENT