Jailer 2: రజనీకాంత్ 'జైలర్ 2'కు అదిరిపోయే ఓటీటీ ఆఫర్.. ఎన్ని వందల కోట్లంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2'కు సంబంధించిన ఓటీటీ డీల్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. తొలి భాగం 'జైలర్' డిజిటల్ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సీక్వెల్ కోసం అంతకుమించి భారీ మొత్తం పలకడం తమిళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
అక్టోబర్ 15న రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2026 అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
'జైలర్'లో ప్రేక్షకులను అలరించిన 'టైగర్ ముత్తువేల్ పాండ్యన్' పాత్రలో రజనీకాంత్ మరోసారి కనిపించనున్నారు. ఈ సీక్వెల్‌లో ఎస్.జే. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
థియేటర్లలోకి రాకముందే 'జైలర్ 2' ఓటీటీ హక్కులకు ఈ స్థాయిలో భారీ ధర పలికినట్లు వార్తలు రావడంతో.. సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.