Loading...
Slum Dog Glimpse: 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు'.. హృదయాన్ని తాకుతున్న 'స్లమ్ డాగ్' గ్లింప్స్!

Slum Dog Glimpse: 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు'.. హృదయాన్ని తాకుతున్న 'స్లమ్ డాగ్' గ్లింప్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌'. ఈసినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం మరో కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. సీనియర్‌ నటి జరీనా వహాబ్‌ ఈ సినిమాలో 'జుబైదా' అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా 'జుబైదాగా జరీనా వహాబ్‌' అంటూ ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 17సెకండ్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. 'నాంపల్లి స్టేషన్‌కు వెళ్లి ట్రైన్‌ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నాను.. కానీ ధైర్యం సరిపోలేదు' అనే డైలాగ్‌తో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది.

వివరాలు

విజయ్‌ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్‌

ఆ తర్వాత ఆకలి, పేదరికం, నిస్సహాయత చుట్టూ తిరిగే జరీనా వహాబ్‌ పాత్ర తాలూకు భావోద్వేగాలను ఇందులో చూపించారు.

'ఈ ఆకలి ముందు అన్ని ఓడిపోతాయి రా.. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ మంటకలిసిపోతాయి', 'నాకు తెలియకుండానే నా చేతులు అడుక్కోవడం మొదలుపెట్టాయి', 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు' వంటి డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.

ముఖ్యంగా చివరి డైలాగ్‌ పాత్రలోని బాధతో పాటు తల్లి భావోద్వేగాన్ని కూడా బలంగా ఆవిష్కరిస్తోంది. జరీనా వహాబ్‌ తన నటనతో గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఇక 'స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌' సినిమాలో విజయ్‌ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్‌ నటిస్తున్నారు.

వివరాలు

త్వరలోనే విడుదుల

సీనియర్‌ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పూరి జగన్నాథ్‌ మార్క్‌ టేకింగ్‌తో పాటు విజయ్‌ సేతుపతి, సంయుక్త మీనన్‌, టబు, జరీనా వహాబ్‌ వంటి ప్రతిభావంతులైన నటీనటుల కలయిక ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

తాజాగా విడుదలైన జరీనా వహాబ్‌ గ్లింప్స్‌.. సినిమాలోని కథ, పాత్రలు, భావోద్వేగాలపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT