Mokshagna : టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ విషయం ఊరిస్తున్నప్పటికీ,మోక్షజ్ఞ ఎంట్రీ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల, మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి, ప్రత్యేకంగా ప్రశాంత్ వర్మ దాని గురించి మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వాటన్నిటిని నిజం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చేసాడు. తన వ్యక్తిగత 'X' లో బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ నుద్దేశిస్తూ 'సింబా ఈజ్ కమింగ్' హాష్ ట్యాగ్ జత చేసి సింబా లోని పోస్టర్ ను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామకృష్ణ సినీ స్టూడియోస్ లో చిత్రం పూజ కార్యక్రమాలు
ఈ సెప్టెంబరు 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఆరోజు అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం. హనుమాన్ సినిమాగా మాదిరిగానే బాలయ్య కొడుకు సినిమా కూడా మైథలాఙికల్ టచ్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. సినిమా చివర 20 నిమిషాలు మాములుగా ఉండదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మోక్షు వైజాగ్ లో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు డాన్స్, గుర్రపు స్వారీ లోను మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడు.