Kiara Advani: మా జీవితంలోకి కొత్త బహుమతి రాబోతోంది.. కియారా ఎమోషనల్ పోస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పాప సాక్స్ ఫోటోను షేర్ చేస్తూ తమ జీవితానికి అద్భుతమైన బహుమతి త్వరలోనే వస్తున్నట్లు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ ప్రకటనతో అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత నెలలో కియారా అనారోగ్యంతో బాధపడుతోందని వార్తలొచ్చాయి.
ఆసుపత్రిలో చేరిందని కూడా ప్రచారం జరిగింది. అందుకే ఆమె 'గేమ్ ఛేంజర్' సినిమా ట్రైలర్ లాంచ్‌కు హాజరుకాలేకపోయింది.
ఇప్పుడు ఈ శుభవార్తతో ఆ వార్తలకు ముగింపు పలికింది. కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
Details
కియారాకు శుభాకాంక్షల వెల్లువ
'షేర్షా' సినిమా సెట్స్‌లో ప్రేమలో పడిన ఈ జంట, ఇటీవలే తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
2019లో వీరి డేటింగ్ గురించి పుకార్లు వినిపించగా, 2021 నాటికి ఒకరికి ఒకరు తమ కుటుంబాలను పరిచయం చేసుకున్నారు.
కియారా 2014లో 'ఫగ్లీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ ఆమెకు నిజమైన గుర్తింపు 2016లో వచ్చిన 'ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'తో వచ్చింది.
అనంతరం 'కబీర్ సింగ్' ద్వారా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన 'షేర్షా' కూడా ఆమెకు ప్రత్యేకమైన సినిమా.
ఇప్పుడు కియారా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించనుంది. అభిమానులు, పరిశ్రమ ప్రముఖులంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.