
ArjunDas : కోలీవుడ్‌లో కొత్త లవ్ స్టోరీ.. అర్జున్ దాస్ - ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడ్డారా?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ పరిశ్రమలో ఒక వైపు స్టార్ జంటలు విడిపోతూ వార్తల్లో నిలుస్తుండగా, మరో వైపు కొత్త ప్రేమ కథలు ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా హీరో ధ్రువ్ విక్రమ్, నటి అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య రిలేషన్‌షిప్ ఉన్నట్టుగా గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు, ఔనని కూడా అనలేదు, కాదని కూడా అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన హీరో విశాల్ మాత్రం త్వరలో తన సోలో లైఫ్‌కు ముగింపు పలకబోతున్నాడు. నటి సాయి ధన్సికతో వివాహం జరగనున్నట్టు అధికారికంగా ధృవీకరించారు. ఇదే సమయంలో, స్టార్ హీరో ధనుష్ మరోసారి ప్రేమలో పడ్డాడనే వార్తలు కొంతకాలం క్రితం హాట్ టాపిక్ అయ్యాయి.
Details
ఆర్జేగా కెరీర్ ప్రారంభించిన అర్జున్ దాస్
కానీ ఈ రూమర్స్‌కి చెక్ పెట్టింది నటి మృణాల్ ఠాకూర్. "మేము కేవలం మంచి స్నేహితులమే" అంటూ స్పష్టంచేసింది. తాజాగా మరో లవ్ స్టోరీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అర్జున్ దాస్ - ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు మళ్లీ హంగామా చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పటికీ, అప్పట్లో ఇద్దరూ ఖండించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్‌తో పాటు సినిమా కూడా చేస్తున్న నేపథ్యంలో మరోసారి గాసిప్స్ చెలరేగుతున్నాయి. ఆర్జేగా కెరీర్ ప్రారంభించిన అర్జున్ దాస్, తన ప్రత్యేకమైన వాయిస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Details
సంబరాల ఏటి గట్టులో ఐశ్వర్య లక్ష్మి
ఐశ్వర్య లక్ష్మీ అయితే మెడిసిన్ చదివి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి, సెలెక్టివ్ కథలతో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో సాయి తేజ్ సరసన 'సంబరాల ఏటి గట్టు'లో నటిస్తోంది. ఇదే సమయంలో అర్జున్ దాస్, పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలోనే ఐశ్వర్య లక్ష్మీ, 'జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్రేమ వైపు అడుగులు వేస్తుందా? లేక ఇది కేవలం రూమర్స్ మాత్రమేనా? అన్నది ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించినప్పుడే స్పష్టత రానుంది.