LOADING...
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కొత్త సర్‌ప్రైజ్.. రామ్ చరణ్-ఉపాసనకు మెగా వారసుడు రాబోతున్నాడా?
మెగా ఫ్యాన్స్‌కు కొత్త సర్‌ప్రైజ్.. రామ్ చరణ్-ఉపాసనకు మెగా వారసుడు రాబోతున్నాడా?

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కొత్త సర్‌ప్రైజ్.. రామ్ చరణ్-ఉపాసనకు మెగా వారసుడు రాబోతున్నాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, మెగా కోడలు ఉపాసన దంపతులు ఇప్పటికే తమ జీవితంలో తియ్యని బిడ్డతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అందరి ఆశీర్వాదాలతో క్లింకారా కొణిదెల మెగా కుటుంబం నెక్స్ట్‌ జనరేషన్‌లో తొలి వారసురాలిగా ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు మరో సంతోషకరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 'చెర్రీ దంపతులు త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారనే టాపిక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Details

'పెద్ది' షూటింగ్ లో బిజీగా రామ్ చరణ్

దీంతో అభిమానులు, నెటిజన్లు అడ్వాన్స్‌గా కంగ్రాట్స్‌ చెబుతున్నారు. 'న్యూ కింగ్‌ ఈజ్‌ కమింగ్‌' అంటూ ముఫాసా మూవీలోని క్లిప్పింగ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రేమ ఎమోజీలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'పెద్ది' ప్రాజెక్ట్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. షూటింగ్‌ మధ్యలోనూ ఫ్యామిలీ టైమ్‌కి ప్రాధాన్యం ఇస్తూ, తన అభిమానుల హృదయాల్లో మరింత స్థానం సంపాదిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో వైరల్