Dulquer salmaan: ప్రేమకు మరోసారి కొత్త చిగురు..!
ఈ వార్తాకథనం ఏంటి
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో దర్శకుడు రవి నెల కుదిటి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి 'శ్రీ శ్రీ' అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పోస్టర్‌లో దుల్కర్, పూజా హెగ్డే కాలేజీ యూనిఫాంలో పిట్టగోడపై కూర్చొని సరదాగా సంభాషిస్తూ కనిపించగా, వారి మధ్య కెమిస్ట్రీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్‌పై కనిపించిన 'ప్రేమ మళ్లీ చిగురిస్తుంది' అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
వివరాలు
అందమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్..
చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిత్రం హృదయాలను హత్తుకునే అందమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల జంట తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, అనయ్ ఓం గోస్వామి ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.