Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
ఒకప్పుడు లవర్ బాయ్‌గా సినీ రంగంలో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న ఆయన, అనంతరం వరుస అపజయాలతో సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్నాడు.
కొంత గ్యాప్ తర్వాత, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మళ్లీ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ, మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
అందులో భాగంగా, ఇటీవల వరుణ్ సందేశ్ 'విరాజి' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించగా, ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
వివరాలు
అమెజాన్ ప్రైమ్ లో విరాజి
గత ఏడాది ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కథ పరంగా మంచి ఆసక్తి కలిగించినప్పటికీ, పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది.
రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్ల ద్వారా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
ఇప్పుడు, ఈ మూవీ తాజాగా ఓటీటీలో విడుదల కానుంది. ఫిబ్రవరి 18 నుంచి 'విరాజి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే, ఈ సినిమా ప్రస్తుతం రూ.99 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి జానర్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా ఆసక్తికరంగా అనిపిస్తుంది.