Loading...
AR Rahman: 'రామాయణ' కోసం 12 సినిమాలను వదులుకున్న ఏఆర్ రెహమాన్.. కారణం ఇదే!
'రామాయణ' కోసం 12 సినిమాలను వదులుకున్న ఏఆర్ రెహమాన్.. కారణం ఇదే!

AR Rahman: 'రామాయణ' కోసం 12 సినిమాలను వదులుకున్న ఏఆర్ రెహమాన్.. కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. విడుదలైన కొద్ది రోజులకే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విజయం వెనుక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన త్యాగం కూడా ఉందట. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసమే తాను ఏకంగా 10 నుంచి 12 సినిమాల అవకాశాలను వదులుకున్నట్లు ఆయన వెల్లడించారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో దర్శకుడు భరత్ బాలా రూపొందించిన 'బనారస్' సినిమా ప్రదర్శన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రెహమాన్ ఈ విషయాలను పంచుకున్నారు.

వివరాలు

'రావణ తాండవం' బీజీఎం కోసం 13 వెర్షన్లు

'రామాయణ' వంటి మహాకావ్యానికి సంగీతం అందించేందుకు తన సమయాన్ని, శక్తిని పూర్తిగా కేటాయించాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో పలువురు అగ్ర దర్శకుల సినిమాలను కూడా అంగీకరించలేకపోయానని చెప్పారు. అయితే ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి బాధ లేదని, పైగా గర్వంగా ఉందని స్పష్టం చేశారు.

హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో కలిసి ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం గత మూడేళ్లుగా నిర్విరామంగా పనిచేసినట్లు ఆయన వెల్లడించారు. సినిమాలోని ప్రతి పాత్రకు తగినట్లుగా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేసేందుకు ఎంతో సమయం పట్టిందని వివరించారు.

వివరాలు

శ్రమకు తగ్గ ఫలితం

ముఖ్యంగా యష్ పోషించిన రావణుడి పాత్రకు సంబంధించిన 'రావణ తాండవం' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఖరారు చేయడానికి ముందు 12 నుంచి 13 విభిన్న వెర్షన్లను ప్రయత్నించినట్లు తెలిపారు.

చివరకు అందరికీ నచ్చేలా అద్భుతమైన అవుట్‌పుట్ రావడంతో తన శ్రమకు తగిన ఫలితం దక్కిందని రెహమాన్ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

కథతో కనెక్షన్ ఉంటేనే సినిమా ఓకే!

ఈ సందర్భంగా సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో తన ఆలోచనా విధానాన్ని కూడా రెహమాన్ వివరించారు.

ఏదైనా కథపై నిజమైన ఆసక్తి, లోతైన అనుబంధం ఏర్పడితేనే ఆ ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తానని చెప్పారు. తాను చేసే పని తనలోని కళాకారుడికి సంతృప్తిని ఇవ్వడంతోపాటు.. తనతో కలిసి పనిచేసే బృందంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావిస్తానని తెలిపారు.

మూడేళ్ల పాటు మరో ఆలోచన లేకుండా 'రామాయణ' సంగీతం కోసం రెహమాన్ చేసిన కృషి ఇప్పుడు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

ఒకే సినిమా కోసం 10 నుంచి 12 ఇతర అవకాశాలను వదులుకోవడం, రావణుడి పాత్రకు సంబంధించిన బీజీఎం కోసం అనేక వెర్షన్లను సిద్ధం చేయడం ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎంతటి శ్రద్ధ పెట్టారో తెలియజేస్తోంది.

ADVERTISEMENT