
A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?
ఈ వార్తాకథనం ఏంటి
ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.
రెహమాన్ జీవితం సినిమా కథను మించి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి.. ఎంతో శ్రమించి నేడు ఈ స్థితికి చేరుకున్నాడు.
శనివారం ఏఆర్ రెహమాన్ 57వ పుట్టినరోజు కావడంతో.. ఆయన జీవితంలోని కొన్ని కీలక అంశాలను గుర్తు చేసుకుందాం.
ఏఆర్ రెహమాన్ హిందూ కుటుంబంలో జన్మించారు. అతని అసలు పేరు దిలీప్ కుమార్.
రెహమాన్ తన 23సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు.. ఇస్లాంను స్వీకరించారు. అప్పటి నుంచి అతని పేరు అల్లా రఖా రెహమాన్ (ఏఆర్ రెహమాన్)గా మారిపోయింది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. రెహమాన్‌తో పాటు అతని కుమారుడు అమీన్ కూడా జనవరి 6న పుట్టడం గమనార్హం.
రెహమాన్
తండ్రి నుంచి సంగీత వారసత్వం
తన తండ్రి ఆర్‌కే శేఖర్ నుంచి ఏఆర్ రెహమాన్ (A R Rahman Birthday) సంగీతాన్ని వారసత్వంగా పొందాడు.
రెహమాన్‌కు తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే.. అతని తండ్రి చనిపోయాడు.
దీంతో అప్పుడు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తన తండ్రికి చెందిన వాయిద్యాలను అమ్మేయం గమనార్హం.
రెహమాన్ చిన్నతనంలో చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించలేదు.
దీంతో కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. ఒకవైపు కీ బోర్డు ప్లేయర్ గా పని చేస్తూనే.. స్కూల్‌కు వెళ్లేవాడు.
అయితే తన 15వ ఏట అతను సరిగా హాజరు లేకపోవడంతో అప్పటి నుంచి పాఠశాలకు వెళ్లడం మానేశాడు. ఆ తర్వాత సంగీతాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు.
రెహమాన్
సంగీతంతోనే డిప్రెషన్‌ను జయించాడు
రోజులు గడుస్తున్నా.. తన జీవితంలో ఎదుగుదల లేకపోవడంతో తన 25వ ఏట రెహమాన్ (A R Rahman Birthday) ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
తండ్రి మరణిచడం.. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, సంపాదన అంతంత మాత్రంగానే ఉండటంతో అతనికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది.
తన దగ్గర ఉన్న సంగీతం అనే ఆయుధంతో డిప్రెషన్‌ను రెహమాన్ జయించాడు.
సంగీతంలో ఎక్కువ సమయం గడిపేవాడు. దీంతో ఆత్మహత్య ఆలోచన నుంచి రెహమాన్ బయటకు వచ్చాడు.
కొన్ని రోజులకే దర్శుకుడు మణిరత్నం నుంచి పిలుపు వచ్చింది. 1991లో 'రోజా' సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది.
రెహమాన్
రెండు ఆస్కార్‌లు, ఆరు జాతీయ అవార్డులు
రోజా సినిమాతో రెహమాన్ (A R Rahman Birthday) వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.
2013 నాటికి రెహమాన్ పేరు ఆస్కార్ అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది.
రెహమాన్ ఇప్పటివరకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 17 సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.
రెహమాన్ గౌరవార్థం కెనడాలోని ఒక రహదారికి అతని పేరు పెట్టడం విశేషం.
ఇంకా రెహమాన్ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు, పురస్కారాలను అందుకున్నారు.
తన పాటలతోో భారతీయులనే కాదు.. ప్రపంచంలోని సంగీత అభిమానులందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాడు.