Page Loader
Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌‌లో మైనపు విగ్రహం
రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌‌లో మైనపు విగ్రహం

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌‌లో మైనపు విగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రసిద్ధ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ పూర్తయింది. టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా అవార్డుల వేడుకలో దీన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్‌ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే టాలీవుడ్‌కి చెందిన ప్రభాస్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలు కూడా మేడమ్‌ టుస్సాడ్స్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఆ జాబితాలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Details

కిస్మస్ కానుకగా 'గేమ్ ఛేంజర్' రిలీజ్

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, కథని కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని "రా మచ్చా మచ్చా" పాటను త్వరలో విడుదల చేయనున్నారు.