Page Loader
Sandhya Raju:సంధ్యా రాజ్‌కు అరుదైన గౌరవం - భారత రాష్ట్రపతి నుండి ప్రత్యేక ఆహ్వానం  
సంధ్యా రాజ్‌కు అరుదైన గౌరవం

Sandhya Raju:సంధ్యా రాజ్‌కు అరుదైన గౌరవం - భారత రాష్ట్రపతి నుండి ప్రత్యేక ఆహ్వానం  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2024
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం లభించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మకమైన "ఎట్ హోమ్" రిసెప్షన్‌కు హాజరు కావాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆమెకు ఆహ్వానం అందింది. సంధ్యా రాజు, తన తొలి తెలుగు చిత్రం`నాట్యం`కు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. సంధ్యారాజు తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ P.R. వెంకట్రామ రాజా కుమార్తె. సంధ్యారాజు హైద‌రాబాద్‌లో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడమీ, నిశృంఖ‌ల ఫిల్మ్ వ్యవస్థాపకురాలు, కూచిపూడి శాస్త్రీయ నృత్య రూపానికి టార్చ్ బేరర్‌గా ఉన్నారు. ఆమె ప్రత్యక్ష ప్రదర్శనలు, డ్యాన్స్ అకాడమీ, సినిమా ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు అందించారు.

వివరాలు 

 రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్రతి ఏడాది సాంప్రదాయంగా నిర్వహించే.. ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్.. 

2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి హోస్ట్ చేసిన "ఎట్ హోమ్" రిసెప్షన్ రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఒక విశిష్ట కార్యక్రమం. ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‎ని ఆగ‌స్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్రతి ఏడాది సాంప్రదాయంగా నిర్వ‌హిస్తారు. ఈ రిసెప్షన్ కి సాంప్రదాయ దుస్తులలో, సీనియర్ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు, దౌత్యవేత్తలు, ఇతర ప్రముఖ వ్యక్తులతో సహా అనేక మంది ప్రముఖ అతిథులు విచ్చేస్తారు. భారతీయ శాస్త్రీయ నృత్యం, చలనచిత్ర కళాకారిణిగా, నటిగా, అలాగే కూచిపూడి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, సంరక్షించడంలో ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానం అందింది.