Page Loader
Sonu Sood : సోనూ సూద్ కి అరుదైన గౌరవం.. థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం
సోనూ సూద్ కి అరుదైన గౌరవం.. థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం

Sonu Sood : సోనూ సూద్ కి అరుదైన గౌరవం.. థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు. సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయ‌న, నిజ జీవితంలో మాత్రం హీరోగా మారి ఎంతోమందికి సేవ చేస్తున్నారు. కరోనాకాలంలో ఆయన ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. తన ఫౌండేషన్ ద్వారా పేదలకు, అవసరమున్న వారికి సాయం చేస్తూ రియల్ హీరో గా సోనూ సూద్ ప్రశంసలను పొందుతున్నారు. తాజాగా సోనూ సూద్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. థాయ్‌ లాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్, సలహాదారుగా సోనూ సూద్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు.

Details

ఆనందంగా ఉంది : సోనూ సూద్

ఈ గౌరవాన్ని పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. మొదటిసారిగా తన కుటుంబంతో కలిసి అంతర్జాతీయ పర్యటన కోసం థాయ్‌లాండ్ వెళ్ళిన అనుభవం గుర్తు చేసుకున్నారు. తాజాగా అదే దేశానికి టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం ఎంతో ప్రత్యేకమైన అనుభవం అని పేర్కొన్నారు. ఈ నియామకంతో థాయ్‌లాండ్‌లో అందమైన ప్రదేశాలు, ప్రకృతి అందాలు ప్రపంచానికి పరిచయం చేయడానికి, తద్వారా అక్కడి టూరిజం రంగాన్ని ప్రోత్సహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టు చేసిన సోనూ సూద్