Loading...
MySaa Movie: 'మైసా' కోసం 'ఒసేయ్‌ రాములమ్మ' రీక్రియేషన్‌.. రష్మిక ఏమన్నారంటే?
'మైసా' కోసం 'ఒసేయ్‌ రాములమ్మ' రీక్రియేషన్‌.. రష్మిక ఏమన్నారంటే?

MySaa Movie: 'మైసా' కోసం 'ఒసేయ్‌ రాములమ్మ' రీక్రియేషన్‌.. రష్మిక ఏమన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ కలయికలో వచ్చిన విజయవంతమైన గీతాల్లో 'ఒసేయ్‌ రాములమ్మ' టైటిల్‌ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడీ ఐకానిక్‌ గీతాన్ని రష్మిక మందన్న నటిస్తున్న 'మైసా' సినిమా కోసం చిత్ర బృందం సరికొత్తగా రీక్రియేట్‌ చేసింది. రష్మిక టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సముద్రఖని, రావు రమేశ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో 'ఒసేయ్‌ రాములమ్మ' రీక్రియేటెడ్‌ గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

వివరాలు

ఐకానిక్‌ పాటను రీక్రియేట్‌ చేయడం పెద్ద బాధ్యత: రష్మిక

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 1997లో వచ్చిన 'ఒసేయ్‌ రాములమ్మ' అప్పట్లోనే ఎంతో ముందుచూపుతో తెరకెక్కించిన సినిమా. అది చరిత్ర సృష్టించింది.

అలాంటి సినిమా టైటిల్‌ పాటను రీక్రియేట్‌ చేస్తున్నామని చెప్పగానే నా మనసులో కొంచెం భయం మొదలైంది. ఎందుకంటే ఇది ఐకానిక్‌ పాట. దీన్ని మళ్లీ సృష్టించడం చాలా పెద్ద బాధ్యత. మాతృక పాటను మేము పూర్తిగా మ్యాచ్‌ చేయలేము.

కానీ ఆ పాటకు న్యాయం చేసేలా మా వంతు ప్రయత్నం చేశాం. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్‌ పాడటం చాలా ఆనందంగా ఉంది.

అప్పట్లో ఒరిజినల్‌ పాటకు మీరు ఎంత ప్రేమను పంచారో.. ఇప్పుడు మేము చేసిన ఈ రీక్రియేషన్‌కూ అంతే ప్రేమను అందించి ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

వివరాలు

27న థియేటర్లలో సింహం కనిపించబోతోంది: సుద్దాల

గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. ''ఈరోజు అందరికీ మా 'మైసా' గర్జన వినిపించింది. ఈ నెల 27న థియేటర్లలో ఆ సింహం కనిపించబోతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు రవీంద్ర పుల్లె, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, అజయ్‌, వీరసాయి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT