LOADING...
Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లో ‌సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు
రెండో వీకెండ్‌లో ‌సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు

Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లో ‌సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి ఫ్లాప్స్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదటి వారం థియేటర్లలో దుమ్ములేపిన ఈ చిత్రం, రెండో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లోనే BookMyShowలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ మాస్ పవర్‌కు నిదర్శనం. నేడు ఆదివారం కావడం, రేపు సోమవారం జనవరి 26, రిపబ్లిక్ డే సెలవు కలిసిన నేపథ్యంలో థియేటర్లు మెగా సందడితో కళకళలాడుతున్నాయి.

Details

వెంకీ గౌడ్ పాత్రలో అలరించిన వెంకటేష్

చిత్రంలోని మరో హైలైట్ విక్టరీ వెంకటేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో 'వెంకీ గౌడ'గా చేసిన క్యామియో ఈ సినిమా కోసం పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊర్రూతలూగించేలా చేస్తున్నారు. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టడంలో ఏమీ తగ్గలేదు. ఈ లాంగ్ వీకెండ్ వసూళ్లతో సినిమా కొత్త రికార్డులు సృష్టించడమే ఖాయం. మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది, మెగా ఫ్యాన్స్‌కు అసలైన సంక్రాంతి పండుగ అనుభూతిని అందిస్తూ, సెంటర్ స్టేజ్‌పై నిలిచింది.

Advertisement