Page Loader
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో యోగా విశిష్టతలు తెలియజేసే ప్రత్యేక ఎపిసోడ్​ ఆరోగ్యమే మహాయోగం 
ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో యోగా విశిష్టతలు తెలియజేసే ప్రత్యేక ఎపిసోడ్​ ఆరోగ్యమే మహాయోగం 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 20, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఎపిసోడ్ లో, డాక్టర్ తేజస్విని మనోజ్ఞ అందించే ఆరోగ్య రహస్యాలు, యోగాసనాలు, మంతెన సత్యనారాయణ ప్రత్యేక సూచనలు ఉండనున్నాయి. ప్రముఖ గాయకుడు మనో హాజరుకానున్న ఆరోగ్యమే మహాయోగం యోగా డే స్పెషల్​ ఎపిసోడ్, జూన్​ 21 బుధవారం, ఉదయం 8:30 గంటలకు, మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో యోగా గురువు డాక్టర్​ తేజస్విని మనోజ్ఞ, తన ఆరోగ్య రహస్యాలను పంచుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారు. అంతేకాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తన దినచర్యను ఎలా ప్లాన్​ చేసుకుంటారో, తన ఆహారపు అలవాట్లు, అభిరుచులను ప్రేక్షకులతో పంచుకుంటారు

Details

ప్రపంచ సంగీత దినోత్సం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం 

జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకుని జీ తెలుగు సక్సెస్​ఫుల్​ రియాలిటీ షో సరిగమప సింగర్స్​ మనీషా, శశాంక్​, సింధుజ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అలరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయకుడు మనో ప్రేక్షకులతో తన ఆహారపు అలవాట్లను పంచుకుంటారు. వాటిలో ఏవి మంచివో, ఏవి చెడ్డవో కూడా వివరిస్తారు. తనతో ఆరు నెలలు సహవాసం చేస్తే మంతెన సత్యనారాయణ కూడా మంచి గాయకుడు అవుతారంటూ నవ్వులు పూయిస్తారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఆరోగ్యమే మహాయోగం ప్రోమో