చేతుల ఆకారాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చే యోగాసనాలు
ఈ వార్తాకథనం ఏంటి
చేతులు అందంగా మారడానికి జిమ్ లో గంటలు గంటలు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ వ్యాయామాలు చేసినప్పుడు చేతులు కండపట్టి ఒక ఆకారంలో ఆకర్షణీయంగా ఉంటాయి.
కానీ జిమ్ మానేసిన తర్వాత ఈ ఆకారం చెదిరిపోయి అందవిహీనంగా తయారవుతాయి. ఇలాంటి వారికి యోగాసనాలు బాగా పనిచేస్తాయి. చేతుల ఆకారాన్ని అందంగా మార్చే యోగాసనాలు ఎలా వేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
అధోముఖ స్వానాసనం:
ముందుగా బోర్లా పడుకుని చేతులను తలకాయ ముందుకు పెట్టి, నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ పొజిషన్లో మీ చేతులు మీ కాళ్లు తప్ప మరే భాగం కూడా నేల మీద తాకకూడదు.
చూడడానికి టేబుల్ టాప్ పొజిషన్ లాగా ఉండాలి. కాసేపు ఇలా ఉండి ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి.
Details
సులభంగా వేయగలిగే భుజంగాసనం
మకర అధోముఖ శ్వానాసనం
బోర్లా పడుకుని, మోచేతుల కింది భాగాన్ని మొత్తం నేలకు ఆనించి, కొంచెం పైకి లేవాలి. ఈ పొజిషన్ లో మీరు కాలివేళ్ళ మీద నిల్చోవాలి. మీ బాడీ, భూమికి సమాంతరంగా కనిపించాలి.
ధనూరాసనం
బోర్లా పడుకుని కాళ్ళను వెనక్కి వంచి, రెండు చేతులతో ఆ కాళ్ళను పట్టుకోవాలి. ఇప్పుడు వీలైనంతగా బాడీని సాగదీయాలి. ఈ పొజిషన్లో మీ తలను పైకి ఎత్తాలి. అలా కొద్దిసేపు ఉన్న తర్వాత రిలాక్స్ అవ్వాలి.
భుజంగాసనం
ఈ ఆసనం చేయడం చాలా తేలిక. ముందుగా బోర్లా పడుకుని చేతులను భుజాల పక్కన నేల మీద ఆనించి కేవలం నడుము భాగాన్ని మాత్రమే పైకి లేపాలి.