OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కోసం పాట పాడిన శింబు
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా 'ఓజి'. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్‌ను తెచ్చింది. ఓజి సినిమాను చూపించడానికి సుజీత్ పవన్‌కు డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు.
సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది,
పవన్ డేట్స్ ఇచ్చే సరికి షూటింగ్ పూర్తి చేయడానికి మేకర్స్ ధీమాగా ఉన్నారు. పవన్ కూడా మిగతా సినిమాల కంటే ముందుగా ఓజి సినిమా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Details
మార్చి 27న ఓజీ రిలీజ్
. ఈ సినిమాపై తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒక సాంగ్ కోసం తమిళ స్టార్ శింబును సంప్రదించారని, శింబు వెంటనే ఇప్పటికీ పాడతాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపారు.
ఈ సాంగ్ ఇప్పటికే రెడీ అయింద. విడుదల తర్వాత అభిమానులను మరింత హ్యిప్ చేయడం ఖాయమని తమన్ పేర్కొన్నారు.
ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ అనే పాట శింబు పాడినట్లు తమన్ ధ్రువీకరించారు.
ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించగా, 2025 సమ్మర్‌లో మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.