LOADING...
Rajinikanth: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. పారిశుద్ధ్య కార్మికురాలికి బంగారు కానుకిచ్చిన రజనీకాంత్
నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. పారిశుద్ధ్య కార్మికురాలికి బంగారు కానుకిచ్చిన రజనీకాంత్

Rajinikanth: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. పారిశుద్ధ్య కార్మికురాలికి బంగారు కానుకిచ్చిన రజనీకాంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలో జరిగిన ఓ ఘటన నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనకు దొరికిన భారీ మొత్తంలో బంగారాన్ని ఎలాంటి ఆశ లేకుండా పోలీసులకు అప్పగించిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్వయంగా అభినందించారు. అంతేకాదు, ఆమెను తన ఇంటికి పిలిచి సన్మానిస్తూ బంగారు గొలుసును కానుకగా అందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50)కు ఇటీవల రోడ్డుపై 45 తులాల బంగారం దొరికింది. దాన్ని స్వంతం చేసుకునే ఆలోచన లేకుండా వెంటనే పోలీసులకు అప్పగించడంతో ఆమె నిజాయతీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్ర నటుడు రజనీకాంత్‌ ఆమెను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించారు.

Details

అప్యాయంగా మాట్లాడిన రజనీ

పద్మతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, ఆమె నిజాయతీకి గుర్తుగా బంగారు గొలుసును బహూకరించి గౌరవించారు. ఇదే కాదు, పద్మకు ప్రభుత్వ, సంస్థల నుంచి కూడా అరుదైన గౌరవాలు లభించాయి. ఇటీవల భారత తపాలా శాఖ ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. అలాగే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని ఆమెకు అందజేశారు. ప్రభుత్వం తరఫున కూడా ఆమె నిజాయతీని గుర్తించి రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించారు. పద్మ చేసిన ఈ కార్యం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుండగా, ఆమెకు లభిస్తున్న గౌరవాలు నిజాయతీకి దక్కే నిజమైన గుర్తింపుగా నిలుస్తున్నాయి.

Advertisement