తదుపరి వార్తా కథనం

ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 05, 2023
03:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్, శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఒక వీడియో లీకైంది. గుడిలో సమంత, విజయ్ దేవరకొండలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన వీడియో, ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
అయితే చాలామంది ఖుషి సినిమా షూటింగ్ పార్ట్ అయిపోయిందని అంటున్నారు. ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
అదలా ఉంచితే, మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేయబోతున్నారు. మొదటి పాట మంచి హిట్టయిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి నుండి లీకైన వీడియో
#Kushi 🤗❤️#VijayDeverakonda #Samantha pic.twitter.com/poSmhaxz24
— C_kir_an (@kirancsiva) July 4, 2023