ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..!
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. టీజర్ కు అభిమానుల నుంచి స్పందన లభించకపోవడంతో మరో ఆరు నెలల పాటు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాదాపు రూ.100 నుంచి 150 కోట్ల ఖర్చుతో మళ్లీ వీఎఫ్‌ఎక్స్ ను మెరుగుపరుస్తున్నారు. ఇక రెండు నెలల్లో ఈ సినిమా థియోటర్లలో సందడి చేయనుంది. ఒకానొక సందర్భంలో ఈ సినిమా ఆ తేదీకి రీలీజవుతుంగా అనే అనుమానులు కూడా నిన్న, మొన్నటి వరకూ ఉండేది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.
రూ.500 కోట్లతో ఆదిపురుష్ చిత్రీకరణ
ఇదిలా ఉండగానే ఆదిపురుష్ అప్ డేట్ వెర్షన్ ను సినిమా యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ కు విమర్శలు రాగా.. తాజాగా సరికొత్త టెక్నాలజీతో అప్ డేట్ టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ టీజర్ తెగ నచ్చేసింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించారు. కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడగా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశారు. జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.