Page Loader
Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ.. 
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ..

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ సాయి కుమార్ కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఆది సాయి కుమార్ తన నటనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో విభిన్నమైన సినిమాను ప్రకటించారు. 'శంబాల' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో ఆది, ఆనంది హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.

వివరాలు 

టైటిల్ పోస్టర్‌తో కట్టిపడేసిన అంచనాలు 

'శంబాల' సినిమా కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా ఒక కొత్త ప్రపంచానికి చూపిస్తున్నారు. గ్రామంలో ఒక్కరుకూడా లేని పరిస్థితి, సైకిల్‌పై ఉన్న పాల క్యాన్ కిందపడటం, ఆ పాలల్లో రక్తం కనిపించడం, ఒక కుక్క ఆ పాల్లను తాగడం వంటి దృశ్యాలను భయంకరంగా చూపించారు. మేఘాలు గర్జిస్తున్నా, ఉరుములు మెరుపులతో పెను ప్రళయానికి సూచనగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచిస్తోంది. 'శంబాల' కథలో థ్రిల్లింగ్ అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్ 

ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్టుగా కనిపించబోతున్నారు. పవర్‌ఫుల్, ఛాలెంజింగ్ పాత్రను ఆయన పోషించనున్నారని సమాచారం. ఆది సరసన ఆనంది హీరోయిన్‌గా నటించనుంది, ఆమె తెలుగు,తమిళ భాషల్లో ఇప్పటికే కొన్ని విజయవంతమైన సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. ఇప్పటికే , ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

వివరాలు 

నూతన కథతో 'శంబాల' 

'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ వంటి ప్రత్యేక సినిమాతో దర్శకుడిగా తన క్రమంలో గుర్తింపు పొందిన యుగంధర్ ముని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. 'శంబాల'ను కూడా కొత్త కథతో రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోంది, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశంతో తీసుకువస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్రేజీగా అక్కటుకుంటున్న టైటిల్ పోస్టర్