Shambhala OTT : ఓటీటీలోకి ఆది సాయికుమార్ సూపర్ హిట్ శంబాల.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'శంబాల'. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇకపై ఇంట్లోనే సౌకర్యంగా వీక్షించవచ్చు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించగా, యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
వివరాలు
ఆకాశం నుంచి ఒక ఉల్క పడటం కథకు మలుపు
కథానాయికగా అర్చన అయ్యర్ నటించింది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండా, అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. కథ విషయానికి వస్తే... ఈ సినిమా 1980వ దశకం నేపథ్యంతో సాగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడటం కథకు మలుపు. ఆ సంఘటన తర్వాత గ్రామంలో అనేక అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలకు పాల్పడతారు, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు.
వివరాలు
ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైన శంబాల
మూడనమ్మకాలు ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో జరుగుతున్న ఈ రహస్య సంఘటనల వెనుక నిజాన్ని వెలికితీయడానికి ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను అక్కడికి పంపిస్తుంది. శంబాల గ్రామంలో విక్రమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను అతడు ఛేదించగలిగాడా? లేదా? అనే ఆసక్తికరమైన అంశాలే ఈ సినిమా కథాంశం. ఇప్పుడు థియేటర్ల తర్వాత, 'శంబాల' ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆహా ఓటిటీ చేసిన ట్వీట్
Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha
— ahavideoin (@ahavideoIN) January 15, 2026
(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b