Asha Sharma: 'ఆదిపురుష్' మూవీ నటి మృతి
భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటి ఆశా వర్మ ఆదివారం కన్నుముశారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. 88 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సినిమాలు, టీవీ షోల్లో చేస్తూ ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 'దో దిశాయీన్' మూవీలో నటించి అద్భుత ప్రశంసలు అందుకుంది. వెండితెరపై 'ముఝే కుచ్ కెహనా హై, 'ప్యార్ తో హోనా హి థా', 'హమ్ తుమ్హారే హై సనమ్' సీరియల్స్‌లో నటించారు. ఇక ఆమె 'ఆదిపురుష్' చిత్రంలోనూ నటించారు.