LOADING...
Akanda2 : బాలయ్య-బోయపాటి కాంబోలో ఆఖండ 2.. రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్
బాలయ్య-బోయపాటి కాంబోలో ఆఖండ 2.. రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్

Akanda2 : బాలయ్య-బోయపాటి కాంబోలో ఆఖండ 2.. రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'అఖండ 2'పై టాలీవుడ్‌లోనే కాదు, పాన్‌ ఇండియా స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్‌లో ప్రత్యేకమైన ముద్ర వేసే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు గురించి చాలా రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 'అఖండ' మొదటి భాగం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్ వద్ద ఉండటంతో, సీక్వెల్ కూడా వారే సొంతం చేసుకుంటారనే టాక్ వచ్చింది.

Details

భారీ ధరకు దక్కించుకున్న హాట్ స్టార్!

తాజాగా లభించిన సమాచారం ప్రకారం.. నిజంగానే 'అఖండ 2' పాన్ ఇండియా డిజిటల్ రైట్స్‌ను హాట్‌స్టార్‌ భారీ మొత్తానికి క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ డీల్ విలువ రూ.80 కోట్లకు పైగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని వల్ల 'అఖండ 2' ఓటీటీ ఒప్పందం, కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా మొత్తం దక్షిణాది సినీ పరిశ్రమలో రికార్డు స్థాయి డీల్‌గా నిలిచిందని చెప్పాలి. మరోవైపు బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్‌. గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. దాంతో, ఈ విజయవంతమైన కాంబోలో వస్తున్న అఖండ 2 ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో అన్న కుతూహలం అభిమానుల్లో మరింత పెరిగిపోతోంది.