LOADING...
Aamir Khan Marriage: ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్.. సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్
ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్.. సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్

Aamir Khan Marriage: ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్.. సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకుని జీవితంలో మూడోసారి పెళ్లి బంధంలోకి ప్రవేశించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆమిర్ నివాసంలో ఈ వివాహ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ వివాహ నమోదు పత్రాలపై సంతకాలు చేసి అధికారికంగా ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ గౌరీ స్ప్రాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమెతో తనకు దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆయన వెల్లడించారు.

వివరాలు

సాదాసీదాగా మూడో పెళ్లి..

ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, మొదట రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం 2005లో సినీ నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు 2021లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే, ఆమె బెంగళూరుకు చెందినవారు. వెల్‌నెస్, బ్యూటీ రంగంలో ఆమెకు మంచి అనుభవం ఉంది. ప్రముఖ సెలూన్ యజమాని రీటా స్ప్రాట్ కుమార్తె అయిన గౌరీ, 2004లో లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఫోటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబైలో 'బిబ్లంట్' పేరుతో ఒక సెలూన్‌ను నిర్వహిస్తున్నారు.

Advertisement