LOADING...
Sitaare Zameen Par: బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఆమిర్ ఖాన్.. 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదల
బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఆమిర్ ఖాన్.. 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదల

Sitaare Zameen Par: బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఆమిర్ ఖాన్.. 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) విడుదలకు సిద్ధంగా ఉంది. 'సబ్ కా అప్న అప్న నార్మల్' అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. కథానాయికగా జెనీలియా నటిస్తున్న ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్. అపర్ణా పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ట్రైలర్‌లోని సన్నివేశాలు భావోద్వేగాలను రేకెత్తిస్తున్నాయి.

Details

జూన్ 20న రిలీజ్

కథ ప్రకారం, ఓ దురుసుగా ప్రవర్తించే బాస్కెట్‌బాల్ కోచ్ (ఆమిర్ ఖాన్) తన ప్రవర్తన వల్ల సస్పెండ్ అవుతాడు. తిరిగి తన బాధ్యతల్లో చేరాలంటే కోర్టు అతనికి ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తుంది. మానసికంగా వెనుకబడ్డ పిల్లలకు బాస్కెట్‌బాల్‌ను నేర్పి వారిని ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం. ఈ సమయంలో కోచ్‌కి ఎదురయ్యే సవాళ్లు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మానవీయత, స్పోర్ట్స్, భావోద్వేగాలు కలగలిసిన ఈ చిత్రం ఓ బలమైన సందేశాన్ని అందించనుంది. తమిళ-హిందీ సినిమాల మాదిరిగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ కథ ఎలా కదిలిస్తుంది అన్నది జూన్ 20న తెలుస్తుంది.