
Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు.. వైరల్ అవుతున్న వీడియో !
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ఇంటిని ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. పోలీసులు బస్సు, వ్యాన్‌లలో బాంద్రాలోని ఆమిర్ ఇంటికి వచ్చారు.దీంతో ఇంత మంది ఒకేసారి ఆయన ఇంటికి ఎందుకు వచ్చారన్నది నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై స్పష్టత కోసం ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఆమిర్ ఖాన్ బృందాన్ని సంప్రదించింది.
వివరాలు
'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమిర్
అయితే, ఆమిర్ టీమ్‌కు కూడా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియదని వారు స్పష్టం చేశారు. "మేమూ ఇంకా వివరాలు సేకరిస్తున్నాం," అని వారు మీడియాతో తెలిపారు. ఐపీఎస్ అధికారులు ఆమిర్‌ను కలిసేందుకే వచ్చారన్న పుకార్లు కూడా కొన్ని మీడియాలో వినిపిస్తున్నాయి. ఇకపోతే, ఆమిర్ ఖాన్ త్వరలో జరిగే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాను ప్రదర్శించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు
25 IPS officers arrive at #AamirKhan's house for a meeting at Bandra.📍#AamirKhanfans #AamirKhanfc pic.twitter.com/nKbvb4TOe3
— Take One Filmy (@TakeOneFilmy) July 27, 2025