Loading...
Aamir Khan: 'రేస్‌ 4'లోకి ఆమిర్‌ ఖాన్‌.. హీరోగా నటించనున్నారా?
'రేస్‌ 4'లోకి ఆమిర్‌ ఖాన్‌.. హీరోగా నటించనున్నారా?

Aamir Khan: 'రేస్‌ 4'లోకి ఆమిర్‌ ఖాన్‌.. హీరోగా నటించనున్నారా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లాల్‌ సింగ్‌ చద్దా' తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ 'రేస్‌'. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'రేస్‌ 4' రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నాలుగో భాగంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాలు

మళ్లీ విజయాల బాట పడతారా?

'ధూమ్‌ 3' ఫేమ్‌ విజయ్‌ కృష్ణ ఆచార్య 'రేస్‌ 4'కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ఈ సినిమా స్క్రిప్ట్‌ ఆమిర్‌ ఖాన్‌కు బాగా నచ్చిందని, ప్రస్తుతం ఆయనతో మేకర్స్‌ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆమిర్‌ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు సమాచారం.

మరి 'రేస్‌ 4'లో ఆమిర్‌ ఖాన్‌ నిజంగానే నటిస్తారా? ఈ సినిమాతో ఆయన మళ్లీ విజయాల బాట పడతారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT