
Daggubati Abhiram : లంకలో వైభవంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా!
ఈ వార్తాకథనం ఏంటి
దగ్గుబాటి (Daggubati) ఇంటి పెళ్లి భజాలు మోగాయి.
టాలీవుడ్ సినీ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్(Abhiram) పెళ్లి చేసుకున్నాడు.
తమ దగ్గర బంధువైన ప్రత్యూషను అభిరామ్ పెళ్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరి పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరి పెళ్లి వేడకు దగ్గుబాటి కుటుంబం తరలి వెళ్లింది.
అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హజరైనట్లు తెలుస్తోంది.
వధువు ప్రత్యుష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువని ఆమె స్వస్థలం కారంచేడు అని సమాచారం.
ఇటీవల ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
Details
200 మంది అతిథుల మధ్య పెళ్లి వేడుక
డిసెంబర్ 6న రాత్రి 8.50గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది.
ఈ వివాహా వేడుకకు 200 మంది అతిథులు హజరైనట్లు సమాచారం. సురేష్ బాబు రెండో కుమారుడు ఇటీవలే హీరోగా 'అహింస' అనే చిత్రంలో నటించాడు.
అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
మరోవైపు దగ్గుపాటి రానా రజనీకాంత్ సినిమా 'తలైవర్ 170'లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇక అభిరామ్ చిన్నాన్న వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.