Page Loader
Poonam Dhillon: డైమండ్‌ నెక్లెస్‌ కోసం ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. పట్టుబడిన నిందితుడు
డైమండ్‌ నెక్లెస్‌ కోసం ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. పట్టుబడిన నిందితుడు

Poonam Dhillon: డైమండ్‌ నెక్లెస్‌ కోసం ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. పట్టుబడిన నిందితుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటి పూనమ్‌ ధిల్లాన్‌ ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష విలువైన డైమండ్‌ నెక్లెస్‌, రూ.35 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుడిగా 37 ఏళ్ల సమీర్‌ అన్సారీ గుర్తించారు. డిసెంబర్‌ 28 నుండి జనవరి 5 మధ్య ముంబైలోని ఖార్‌ ప్రాంతంలోని నటి నివాసంలో పెయింటింగ్‌ పనులు జరిగాయి.

Details

సమీర్ అన్సారీని అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు

ఆ సమయంలోనే విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. పూనమ్‌ ధిల్లాన్‌ ఇంటి అల్మారాను ఓ రోజు తెరిచి ఉన్నదాన్ని గమనించిన సమీర్‌ అన్సారీ, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని చోరీ చేసినాడు. చోరీ చేసిన వస్తువుల్లో డైమండ్‌ నెక్లెస్‌, నగదు ఉన్నాయి. నటి పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన తర్వాత, సమీర్‌ అన్సారీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.