తదుపరి వార్తా కథనం

పుష్ప 2 నుండి వీడియో లీక్: నదిలో లారీలను ఛేజ్ చేస్తున్న జీపులు
వ్రాసిన వారు
Sriram Pranateja
Jun 16, 2023
03:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా పుష్ప 2 షూటింగ్ నుండి ఒక వీడియో లీక్ అయ్యింది.
ఎర్రచందనం దుంగలతో నిండిన లారీలు నదిలో వెళ్తుంటాయి. వాటిని ఛేజ్ చేస్తూ రెండు జీపులు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి.
చూస్తుంటే ఇదేదో యాక్షన్ సీన్ లా కనిపిస్తోంది. పుష్ప 1 లో నదిలో ఎర్రచందనం దుంగలు కొట్టుకుపోవడం చూసాం. ఇప్పుడు ఎర్రచందనం దుంగలు ఉన్న లారీలు నదిలో వెళ్ళే సీన్ ని తీస్తున్నారు.
ఈ షూటింగ్ ని బయట తీసారు కాబట్టి ఎవరో ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వీడియో
#Pushpa2TheRule 🔥🔥🔥@alluarjun pic.twitter.com/wne5FhcEkX
— అల్లుఅర్జున్ అన్న 🦁🔥 (@AlluArjunCulttt) June 15, 2023