
హాలీవుడ్‌లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.
'బ్రేకింగ్ బాడ్', 'బెటర్ కాల్ సాల్' వంటి ప్రసిద్ధ టీవీ షోల్లో ఆయన విలన్‌గా చాలా ఫేమస్ అయ్యారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మార్గోలిస్ గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మార్క్ మార్గోలిస్ మృతి వార్త తెలుసుకున్న 'బ్రేకింగ్ బాడ్'లో నటించిన మరో నటుడు బ్రయాన్ క్రాన్‌స్టన్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. స్నేహితుడి మరణం వార్త విని చాలా బాధపడినట్లు ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
హాలీవుడ్
చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం
1939లో ఫిలడెల్ఫియాలో జన్మించిన మార్గోలిస్‌కు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. నటనపై మక్కువతోనే సినిమాల్లోకి నటించేదుకు న్యూయార్క్ వెళ్లారు.
'స్కార్‌ఫేస్', 'ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్', 'బ్లాక్ స్వాన్', 'ఓజ్' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును పొందారు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇదిలా ఉండగా, 'బ్రేకింగ్ బాడ్'లో అద్భుతంగా నటించిన ఎమ్మీ అవార్డ్స్‌కు నానినెట్ అయ్యారు.
మార్గోలిస్‌కు 61ఏళ్ల భార్య జాక్వెలిన్ ఉన్నారు. వీరికి కుమారుడై ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్.