
Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో.. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై ఆయనపై విచారణ చేపట్టి,అనంతరం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ రోజు ఉదయం విచారణకు హాజరైన షైన్‌ను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
త్వరలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి,తదుపరి చట్ట ప్రక్రియలను అమలు చేయనున్నట్టు తెలిపారు.
కొచ్చిలోని ఒక హోటల్‌లో డ్రగ్స్ వాడుతున్నారన్నసమాచారాన్ని అందుకున్నపోలీసులు ఇటీవల ఆ హోటల్‌పై తనిఖీలు చేపట్టారు.
అయితే, పోలీసులు అక్కడికి చేరకముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి తప్పించుకున్నట్టు వార్తలు వెలుగుచూశాయి.
వివరాలు
షైన్ టామ్ చాకోకు సమన్లు జారీ
అప్పటికే ఆయన మూడో అంతస్తులో ఉండగా, కిటికీ మార్గంగా రెండో అంతస్తులోకి దూకి అక్కడినుంచి పారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు షైన్ టామ్ చాకోకు సమన్లు జారీ చేశారు.
విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఆ ఆదేశాల ప్రకారం, శనివారం ఉదయం 10 గంటలకు ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు ఆయన తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షైన్ టామ్ చాకో అరెస్ట్
#ShineTomChacko Has Been Arrested under Narcotic Drugs & Psychotropic Substances Act (NDPS) in Kochi. pic.twitter.com/sod4fxfkpq
— Christopher Kanagaraj (@Chrissuccess) April 19, 2025