Page Loader
Shine Tom Chacko: పోలీసు విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో
పోలీసు విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో

Shine Tom Chacko: పోలీసు విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన తన న్యాయవాదితో కలిసి ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఎర్నాకుళం నార్త్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఓ హోటల్‌పై జరిగిన డ్రగ్స్ దాడి సమయంలో షైన్ టామ్ చాకో అక్కడినుంచి పారిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వినియోగం అంశంపైనా ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలి ఘటనలో, కొచ్చిలోని ఒక హోటల్‌లో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు అక్కడ సోదాలు చేపట్టారు.

వివరాలు 

షైన్ టామ్ చాకోపై మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి పలు ఆరోపణలు

కానీ,పోలీసులు హోటల్‌కు చేరకముందే షైన్ టామ్ చాకో అక్కడి నుండి తప్పించుకున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ,మూడో అంతస్తులో ఉన్న ఆయన, కిటికీ ద్వారా రెండో అంతస్తు వైపుగా దూకి, అక్కడి నుండి బయటకు పారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇంకా,షైన్ టామ్ చాకోపై మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆమె ప్రకారం ఒక సినిమా సెట్లో షైన్ టామ్ చాకో మత్తులో ఉండగా తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ విషయమై ఆమె 'అమ్మ' కు ఫిర్యాదు చేసిన విషయం ఇప్పటికే బయటపడింది.